బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఆర్మూర్ చేనేత సహకార సంఘానికి కొత్త పాలకవర్గం.. చైర్మన్‌గా చెన్న రవికుమార్ ఏకగ్రీవ ఎన్నిక…..

విజయభారతి :ఆర్మూర్, న్యూస్ 11:

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

ఆర్మూర్ జిల్లా నిజామాబాద్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘం లిమిటెడ్ (రిజిస్ట్రేషన్ నెం. 19794)కు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో చెన్న రవికుమార్ ప్యానల్ ఘన విజయం సాధించింది. జూలై 10న జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 మంది డైరెక్టర్లతో కూడిన ప్యానల్ విజయం సాధించింది.
డైరెక్టర్లుగా చెన్న రవికుమార్, కొంగిరాము గురుడు రామచందర్, చిట్ల శ్యాంసుందర్, బెంకి గంగా మోహన్, మాటేటి ప్రవీణ్ కుమార్, వంగ ఆనంద్ కృష్ణ, అవధూత అరుంధతి, రేగుళ్ల కవిత తదితరులు ఎన్నికయ్యారు.అనంతరం ఈరోజు జరిగిన పాలకవర్గ సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్‌గా చెన్న రవికుమార్, వైస్ చైర్మన్‌గా బెంకి గంగా మోహన్, కార్యదర్శిగా కొంగిరాము గురుడు రామచందర్, కోశాధికారిగా చిట్ల శ్యాంసుందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి రవీంద్ర చేతుల మీదుగా నూతన పాలకవర్గ సభ్యులు నియామక పత్రాలను స్వీకరించారు.ఈ సందర్భంగా నూతన చైర్మన్ చెన్న రవికుమార్ మాట్లాడుతూ, చేనేత సహకార సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేసి చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు.