బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

తాళ్లరాంపూర్ సర్పంచ్ పావని కుటుంబానికి ఆర్మూర్ మండల సర్పంచ్‌ల అండరూ… -50 వేల ఆర్థిక సహాయం అందజేత.. -బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన ప్రజాప్రతినిధులు…

విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జులై 13

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

ఆర్మూర్: ఇటీవల ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందిన తాళ్లరాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని కుటుంబాన్ని ఆర్మూర్ మండల సర్పంచ్‌లు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మానవత్వాన్ని చాటుతూ సర్పంచ్‌లందరూ కలిసి రూ.50,000 ఆర్థిక సహాయాన్ని పావని కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఈ సమయంలో అందరూ ఒక్కటిగా నిలిచి సహాయం చేయడం అభినందనీయమని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. సర్పంచ్ పావని గ్రామాభివృద్ధి కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆమె లేని లోటు గ్రామానికి తీరనిదని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో ఆర్మూర్ మండలంలోని పలువురు సర్పంచ్‌లు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. రాంపూర్ సర్పంచ్ సులం రాజేందర్, ఖానాపూర్ సర్పంచ్ బోదాసు నర్సింలు, ఫతేపూర్ సర్పంచ్ ఆడెపు నాగరాజు, చెపూర్ సర్పంచ్ సారంగి శాంతి, మంథని సర్పంచ్ గొల్ల గంగారాం, గోవిందపేట సర్పంచ్ అప్పల గణేశ్, కోమన్‌పల్లి సర్పంచ్ బంపల్లి ప్రవీణ్, సర్బిర్యాల్ సర్పంచ్ ఎర్రం శ్రీనివాస్, పిప్రి సర్పంచ్ బందెల కిరణ్, మగ్గిడి సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్, చెపూర్‌పల్లె సర్పంచ్ సంజీవ్, ఇస్సాపల్లి సర్పంచ్ విట్టం జీవన్, అందాపూర్ సర్పంచ్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.