బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

నిజామాబాద్‌ జిల్లాలో చచ్చిపోతున్న దొంగలు… నగరంలో చైన్ స్నాచింగ్ కలకలం.. మహిళ మెడలోని మంగళసూత్రం కమ్మలు అపహరణ.. రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు….

విజయభారతి : నిజాంబాద్ జిల్లా క్రైమ్ న్యూస్

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

నిజామాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని ఆమె మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం, చెవులకు ధరించిన కమ్మలను అపహరించి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత మహిళతో నేరుగా మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం దర్యాప్తు అధికారులతో సమావేశమై కేసు పురోగతిపై ఆరా తీశారు.
నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను విశ్లేషించి, వారి ఆచూకీ కనుగొనేందుకు సాంకేతిక ఆధారాలను వినియోగించాలని స్పష్టం చేశారు.
ఈ కేసు ఛేదన కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని ప్రధాన రహదారులు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, ఇతర కీలక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకువస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల నగరంలో ఇలాంటి ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో పోలీసులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.