
విజయభారతి : ఆర్మూర్ న్యూస్
ఆర్మూర్ పట్టణ శివారులో గల పెద్దమ్మ తల్లి దేవాలయం ఆవరణలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, పేరుకుపోయిన చెత్త చెదారాన్ని, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్మూర్ మహాత్మ స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దమ్మ దేవాలయానికి ప్రతి ఆదివారం వందల మంది భక్తులు ఇక్కడ పూజలు నిర్వహిస్తారని, ఇక్కడికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాలను శుభ్రం చేశామన్నారు. దీనికి ఆలయ కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందించారన్నారు. ఇలాగే ప్రతి దేవాలయాన్ని శుభ్రం చేసుకుంటే వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. 61 వారాలుగా ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ స్వచ్ఛ కార్యక్రమం నిర్విరామంగా కొనాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గాజం మచ్చేంధర్, ఆర్మూర్ సదర్ పెద్ద మనిషి బోండ్ల పెద్దులు, ఆలయ కమిటీ సభ్యులు జంగడి శ్రీను, జక్కం ప్రసాద్, బోండ్ల గోపి, బోజన్న, జిన్న రవి, జిన్న సుమన్, బీజేపీ నాయకులు పెంట జలంధర్, విజయానంద్, ద్యాగ ఉదయ్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బొగడమీది ప్రశాంత్, గుర్రం రాకేష్, గణేష్, ఉత్తూరు రాజయ్య, శ్యాం సుందర్, యాదగిరి, కృషివర్ధన్, తదితరులు పాల్గొన్నారు.
