Breaking News

ఆర్మూర్ అభివృద్ధికి ముందడుగు: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డివార్డుల సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి

విజయభారతి, ఆర్మూర్ న్యూస్
రిపోర్టర్: సుంకరి గంగా మోహన్
ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని

ఆర్మూర్ అభివృద్ధికి ముందడుగు: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డివార్డుల సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి

, పెర్కిట్, ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, త్వరలోనే అన్ని వార్డులలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.ట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు తెలిపారు. డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.
డ్రైనేజీ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. వార్డులలో ఏ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.
ఎమ్మెల్యే హామీపై పలువురు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *