Breaking News

నిధులు ఇచ్చి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి….

జూలై 10 న నిర్వహించే వామపక్ష విద్యార్థి సంఘాల కేజీ టూ పీజీ బంద్ ను విజయవంతం చేయండి…

విజయభారతి : నిజామాబాద్ న్యూస్ : రిపోర్టర్ గంగ మోహన్

ఆర్మూర్‌లో ఓటరు నమోదు గణన ఫారాల పంపిణీ… జెస్సు అనిల్ కుమార్ అందజేత

వామపక్ష విద్యార్థి సంఘాల ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడి ఎస్ యు , ఏఐపిఎస్యు – ఆధ్వర్యం లో స్థానిక తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థుల తో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తే విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చి విద్యారంగాన్ని విస్మరించడం సబబు కాదని అన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి వద్దే విద్యా శాఖ ఉన్నా విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకపోవడం మరియు ఎన్నో ఏండ్ల నుండి ఖాళీ గా ఉన్నా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరియు ప్రభుత్వం తీసుకువచ్చిన 7,8,9 జీ ఓ లను రద్దు చేయాలనీ అన్నారు . అలాగే మిడ్ డే మీల్స్ పథకానికి నిధులను పెంచాలి. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ అద్దె భవనాలకు పక్కా భవనాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను 27 వేల నుండి 4 వేలకు కుదించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఈ నెల 10 న నిర్వహించే కేజీ టూ పీజీ బంద్ కు మూల్యం చెల్లించుకోక తప్పదని రాష్ట్ర ప్రభుత్వన్నీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురామ్, పిడి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, ఏఐపిఎస్ యు జిల్లా కార్యదర్శి బోడ అనిల్, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు నిరంజన్, ఏఐఎస్ఎఫ్ టీయు కో – కన్వీనర్ చందు, జిల్లా ఉపాధ్యక్షురాలు భార్గవి, పిడిఎస్ యు యూనివర్సిటీ నాయకులు నితిన్, జిల్లా నాయకులు నవీన్ కృష్ణ, అజయ్, త్రిశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *