
.. విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 6 రిపోర్టర్ సుంకరి గంగా మోహన్
ఆర్మూర్ పట్టణంలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆర్మూర్‌లోని 39వ బూత్ పరిధిలో బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ) వి. రజిని ఆధ్వర్యంలో ఓటరు గణన ఫారాలను పూర్తి చేసి అందజేశారు.
ఈ కార్యక్రమంలో రామ్ శంకర్, సాయి, పూజ, లక్ష్మి, పద్మ, నాగరాజు తదితరులు పాల్గొని తమ గణన ఫారాలను సమర్పించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి అర్హత కలిగిన పౌరుడు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఓటరు నమోదు, గణన ప్రక్రియను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని పూర్తి చేయాలని కోరారు. సరైన ఓటరు జాబితా రూపొందేందుకు ప్రజలు అధికారులకు పూర్తి సహకారం అందించాలని తెలిపారు.మున్సిపల్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవసరమైన సూచనలు, సహాయం అందించారు. ఓటరు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని జెస్సు అనిల్ కుమార్ సూచించారు.
