Breaking News

ఎస్ ఐ ఆర్ ప్రక్రియకై ప్రతి రెండు డివిజన్ లకు ఒక సూపర్వైజర్ నియామకం…. అర్బన్ నియోకజకవర్గ ఈఆర్ఓకో ఆర్డినేటర్ నియామకం…. అర్బన్ పిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ….

విజయభారతి: నిజామాబాద్ న్యూస్

నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో బి ఎల్ ఎ సూపర్వైజర్ ల సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రక్రియ కొరకు కాంగ్రెస్ పార్టీ నుండి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం లోని 301 బూత్ లకు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించడం జరిగిందని,ప్రతి రెండు డివిజన్ లకు ఒక సూపర్వైజర్ ను అంటే సుమారు పడి బూత్ ల చొప్పున నియమించమని, నియోజకవర్గ ERO కో ఆర్డినేటర్ నియమించమన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వే పేరుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతుందని ఎక్కడైతే కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లు ఉంటాయో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, కావున బూత్ లెవెల్ ఏజెంట్లు ఎక్కడ కూడా ఓట్లు డిలీట్ కాకుండా చూసుకునే బాధ్యత మీ పైన ఉంది అని అన్నారు. ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫామ్ లు అందేలా చూసి వాటిని ఎలా నింపాలో కూడా చెప్పాలని, ఫామ్ నింపే ప్రక్రియలు ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేయాలని ఆయన అన్నారు. బి ఎల్ ఏ లకు ఇన్చార్జిలుగా నియమించిన వారు వారి డివిజన్లోతో పాటు వారికి కేటాయించిన డివిజన్లో పర్యవేక్షించాలని ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు నిబద్దతతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ కో ఆర్డినేటర్ ఆకుల లలిత, కార్పొరేషన్ డీసీసీ ఉపాధ్యక్షులు విజయపాల్ రెడ్డి,సలీం,కోశాధికారి సకినాల శివ,జెండా గుడి చైర్మన్ ప్రమోద్ ,ప్రధాన కార్యదర్శులు ధర్మారం అవీన్, జిల్లెల రమేష్, సర్దార్ నరెంద్ర సింగ్, హర్షద్, అధికార ప్రతినిధి గోవర్ధన్,జియా,సీనియర్ నాయకులు ఉబెడ్ బిన్ హందన్, కార్యదర్శులు శోభన్, వెంకటేష్,అబ్దుల్ వహీద్, మరియు బంటు బలరాం, శ్రీశైలం, ముస్తఫ్ఫా ఆల్కఫ్, చరణ్, అపర్ణ, నవాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

ఎస్ ఐ ఆర్ ప్రక్రియకై ప్రతి రెండు డివిజన్ లకు…. ఒక సూపర్వైజర్ నియామకం, అర్బన్ నియోకజకవర్గ … ఈఆర్ఓకో ఆర్డినేటర్ నియామకం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *