Breaking News

విద్యార్థులకు చేయూతగా లక్ష్మీ చేయూత సంస్థ… గోనుగుప్పుల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ

విజయభారతి, భీమ్గల్, జూలై 6: రిపోర్టర్ గంగా మోహన్

భీమ్గల్ మండలంలోని గోనుగుప్పుల గ్రామంలో లక్ష్మీ చేయూత సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.
విద్యార్థుల ఉన్నతికి తోడ్పడటంతో పాటు నిరుపేద కుటుంబాల పిల్లలకు చేయూతనందించే లక్ష్యంతో నిజామాబాద్‌కు చెందిన లక్ష్మీ చేయూత సంస్థ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. పాఠ్యపుస్తకాల పంపిణీతో పాటు పాఠశాల అవసరాల కోసం త్వరలో జిరాక్స్ మిషన్‌ను కూడా అందజేస్తామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సంస్థ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీ చేయూత సంస్థ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి లక్ష్మణ్, సభ్యుడు శ్యాం కుమార్, గ్రామ సర్పంచ్ చరణ్ గౌడ్, ఎస్.ఆర్. భూమేశ్వర్, భోజ గౌడ్, గట్టు భూమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ్ కుమార్, పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఆర్మూర్‌లో ఓటరు నమోదు గణన ఫారాల పంపిణీ… జెస్సు అనిల్ కుమార్ అందజేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *