
తెలంగాణలో ఈ నెల 14న విద్యాసంస్థల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
విజయభారతి : నిజామాబాద్ న్యూస్ Jul 07, 2026, సుంకరి; గంగా మోహన్ రిపోర్టర్
తెలంగాణలో ఈ నెల 14న విద్యాసంస్థల బంద్‌కు ఏబీవీపీ పిలుపు
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ జులై 14న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం 11వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఏబీవీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బంద్‌ను విజయవంతం చేయాలని ఏబీవీపీ కోరింది.
