
విజయభారతి : హైదరాబాద్ న్యూస్ Jul 07, 2026,
అవార్డులు అడిగి తీసుకోవడం భిక్షతో సమానం: రాజేంద్రప్రసాద్
ఒక పురస్కారాన్ని అడిగి తీసుకుంటే అది గౌరవం కాదని, భిక్షతో సమానమని, స్వయంగా గుర్తించి ఇస్తేనే దానికి అసలు విలువ ఉంటుందని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. తనకి పద్మశ్రీ రావడం ఆలస్యమైందని అంగీకరించిన ఆయన, అవార్డుల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని, దివంగత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు కాలంలోనూ అడగలేదని గుర్తు చేసుకున్నారు. తాజాగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఆయన, ఈ గౌరవం అందుకున్న తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
