Breaking News

నేటితో ముగియునున్న కార్పొరేషన్ చైర్మన్ ల పదవీకాలం.

విజయభారతి హైదరాబాద్ న్యూస్ Jul 07, 2026,

పాసు పుస్తకాలు లేని రైతుల పరిస్థితి ఏంటి…

రేపటితో ముగియనున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ల పదవీకాలం
తెలంగాణలో 37 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, ఫెడరేషన్ చైర్మన్ల పదవీకాలం జులై 8వ తేదీతో ముగియనుంది. 2024 జులై 7న రెండేళ్ల కాలపరిమితితో వీరిని నియమించారు. వీరిలో చాలా మంది పదవుల రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి మెజారిటీ చైర్మన్లను రెన్యువల్ చేసేందుకు సిద్ధంగా లేరని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాత చైర్మన్ల పనితీరుపై సీఎం నివేదిక తెప్పించుకున్నారని, రెన్యువల్ కు అర్హులైన వారి సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమైందని సమాచారం. వీరికి రెన్యువల్ కంటే మరో పదవి ఇచ్చేందుకే సీఎం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *