


విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 9
ఆర్మూర్, జూలై 9: ఆర్మూర్ పట్టణంలోని ఎస్‌ఎస్‌కే సమాజ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఘటడి ఆనంద్, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన డీకే రాజేష్‌లను ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్, అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి మెమెంటోలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన నైపుణ్యం దాగి ఉంటుందని అన్నారు. ఆ నైపుణ్యాన్ని సమాజ సేవకు, సంఘ అభివృద్ధికి వినియోగించే అవకాశం కొద్దిమందికే లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వారికి న్యాయం జరిగేలా ముందుండి పోరాడే నాయకత్వాన్ని గుర్తించి ప్రోత్సహించడం ఎంతో అవసరమని తెలిపారు.ఎస్‌ఎస్‌కే సమాజ్ నూతన బాధ్యులు సభ్యులందరినీ కలుపుకొని ముందుకు సాగాలని, సంఘంలోని ప్రతి కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, యువతకు అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నూతన అధ్యక్షుడు ఘటడి ఆనంద్, ప్రధాన కార్యదర్శి డీకే రాజేష్ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అందరి సహకారంతో ఎస్‌ఎస్‌కే సమాజ్‌ను మరింత బలోపేతం చేసి అభివృద్ధి పథంలో నడిపించవచ్చని అయ్యప్ప శ్రీనివాస్ అన్నారు. సంఘ సభ్యుల ఐక్యతే సంస్థకు అసలైన బలమని, పరస్పర సహకారంతోనే సమాజ సేవా కార్యక్రమాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చేపూర్ గణేష్, సభ్యులు షేర్ ఒడ్డెన్న, చేపూర్ ధనంజయ్, అలిశెట్టి నరేష్, వజ్ర ఒడ్డెన్న, గంగాసింగ్, సన్నీ తదితరులు పాల్గొని నూతన బాధ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
