Breaking News

క్షత్రియ సమాజ్ నూతన కార్యవర్గ సభ్యులప్రమాణస్వీకారం…. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన అధ్యక్ష కార్యదర్శులు..

క్రమశిక్షణ, విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఆలయమే పాఠశాల – మానస గణేశ్

, విజయభారతి : న్యూస్ ఆర్మూర్, జూలై 9:

ఆర్మూర్ క్షత్రియ సమాజ్ నూతన కార్యవర్గ సభ్యులతో అధ్యక్ష కార్యదర్శులు గటడి ఆనంద్ డి కె రాజేష్ లు ప్రమాణస్వీకారం చేయించారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పారు. ఓటర్లు తమను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి విషయాన్ని సమిష్టిగా నిర్ణయం తీసుకొని చర్చించి అమలు చేస్తామన్నారు. కోశాధికారిగా వైద్య సంజయ్, నూతన కార్యవర్గ సభ్యులుగా డమాంకర్ రవీందర్, బాదం రాజేందర్, సాత్ పుతే శ్రీనివాస్, బోబిడే గంగా కిషన్, పండిత్ ప్రేమ్, కర్తన్ దినేష్, డీకే శ్రీనివాస్, జివి అరవింద్, కర్తన్ ధర్మేందర్, బొచ్కర్ డిటిపి కృష్ణ, గుజరాతి రామ ఆర్ట్స్ అశోక్, మాణిక్ ప్రవీణ్, డీకే శ్రీహరి, బచ్చేవాల్ రాజు, ఘటడి, బారడ్ గణేష్, గటడి అరుణ్, పోహార్ క్రాంతి, బాదం వినోద్, నగిరి వినోద్, నవీన్, వచ్చేవాల్ రెడ్డి ప్రవీణ్, దొండి లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ మాజీ అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి ప్రకాష్, బారడ్ గంగా మోహన్, యువజన సమాజ్ మాజీ అధ్యక్షుడు సాత్ పుతే సంతోష్, బొచ్కర్ దత్తాద్రి, బారడ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *