బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

కవిత చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి…. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడి….

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ఎంపీ అర్వింద్ ధర్మపురి స్వయంగా కెసిఆర్ కుటుంబ సభ్యురాలు, ఇంటి మనిషి కవిత బిఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీష్ రావుల మీద చేసిన అవినీతి, క్విడ్ ప్రో కో ఆరోపణల మీద సిబిఐ చేత వెంటనే విచారణ జరిపించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ పార్టీ నిధులు, క్విడ్ ప్రో కో లావాదేవీలు, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌తో జరిగినట్లు ఆరోపించిన ఒప్పందాలు, ఫీనిక్స్ సంస్థకు రాజకీయ అండ, గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లకు భూముల కేటాయింపులపై కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవని, వీటిపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్వతంత్ర సీబీఐ దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద దర్యాప్తును సిబిఐ కి అప్పగించడంలో జరిగిన జాప్యం,ఈ-కార్ రేసులో అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలున్నా విచారణ చేపట్టకుండా కేటీఆర్ ని రక్షించడం ,ఫోన్ టాపింగ్ కుంభకోణం బాధ్యులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోపోవడంవల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు ఇప్పటికే శంకిస్తున్నారని, కాంగ్రెస్- బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలు భావిస్తున్నారని అర్వింద్ పేర్కొన్నారు
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని, పూర్తి పారదర్శకతతో నిజానిజాలను వెలుగులోకి తీసుకువచ్చి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…