Breaking News

ఆర్మూర్ లో ఘనంగా జాతీయ విద్యార్ధి దినోత్సవంఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిందర్
విద్యార్థుల భారీ ర్యాలీ ప్రదర్శన నిజామాబాదు , జూలై 9:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ నగరం లో ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం ఏబీవీపీ నాయకులు మరియు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు చేతుల్లో ఏబీవీపీ పరిషత్ జెండాలు పట్టుకుని “భారత్ మాతా కీ జై”, క్షణం క్షణం మా కణం క్షణం భరతమాతకే సమర్పణం అంటూ చేసిన నినాదాలతో నిజామాబాదు పురవీధులు మారుమోగాయి.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోఏబీవిపి ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిందర్ మాట్లాడుతూ.. 1949 జూలై 9న ప్రారంభమైన ఏబీవీపీ, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి శక్తుగా ఎదిగిందని కొనియాడారు. కేవలం విద్యా రంగ సమస్యలపైనే కాకుండా, విద్యార్థుల్లో జాతీయ భావాలు, సమాజం పట్ల బాధ్యతను పెంపొందించడంలో ఏబీవీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. “జ్ఞానం – శీలం – ఏకత” అనే నినాదంతో కోట్లాది మంది విద్యార్థులను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేస్తోందని అన్నారు ఖానాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, మరియు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తోందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి మరిన్ని ప్రజాస్వామ్య పోరాటాలకు సిద్ధమవుతామని తెలియజేసారుఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రితం, సాయికుమార్, రక్షిత్,దినేష్, భాస్కర్, బాలకృష్ణ, సన్నీ, స్నేహిత్,చెర్రీ,లక్కీ, దీపన్, రాజకుమార్, దినేష్, రిచిత్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

క్రమశిక్షణ, విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఆలయమే పాఠశాల – మానస గణేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *