బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

క్రమశిక్షణ, విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఆలయమే పాఠశాల – మానస గణేశ్

విజయభారతి : ఆర్మూర్ న్యూస్ జూలై 9

ఆర్మూర్ పట్టణ శివారులోని గాంధీ నగర్ లో గల ఆక్స్‌ఫర్డ్ స్కూల్ లో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ మనస గణేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
పాఠశాల అనేది కేవలం పుస్తక విద్యను నేర్పే స్థలం మాత్రమే కాదు. క్రమశిక్షణ, విలువలు, బాధ్యత, నాయకత్వం, ఆత్మవిశ్వాసం వంటి జీవిత నైపుణ్యాలను పెంపొందించే ఆలయం అని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధి కోసం ఉత్తమ విద్యా వాతావరణాన్ని అందించేందుకు మేము మా ఉపాధ్యాయ బృందం కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు.
పాఠశాల పాలనాధికారిణి పద్మ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని ఆ ప్రతిభను వెలికితీసి ఉన్నత శిఖరాలకు చేర్చడం మా పాఠశాల లక్ష్యం అని అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థుల కోసం సరదా ఆటలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆనందించారు. సీనియర్ విద్యార్థులు తమ పాఠశాల అనుభవాలను పంచుకుంటూ, ఆక్స్‌ఫర్డ్ స్కూల్ తమలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించిందని తెలిపారు. ఉపాధ్యాయులు నూతన విద్యార్థులను ఆశీర్వదిస్తూ వారికి ఘన స్వాగతం పలికారు.అలాగే సీనియర్ మరియు నూతన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…