బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

పెర్కిట్‌లో విద్యుత్ స్తంభాలకు ప్రైవేట్ కేబుల్ వైర్ల ముప్పు… వర్షాకాలంలో ప్రమాదాలపై స్థానికుల ఆందోళన….. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేబుల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్….

విజయభారతి – ఆర్మూర్ న్యూస్
రిపోర్టర్: సుంకరి గంగామోహన్

ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్–మామిడిపల్లి ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలకు ప్రైవేట్ కేబుల్ నెట్‌వర్క్ వైర్లను ఇష్టారాజ్యంగా చుట్టడం వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల వైర్లు స్తంభాలకు అస్తవ్యస్తంగా చుట్టి ఉండటంతో పాటు, కొన్ని చోట్ల రోడ్డుకు సమీపంగా వేలాడుతూ కనిపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో విద్యుత్ లీకేజీ లేదా షార్ట్‌సర్క్యూట్ జరిగే అవకాశం ఉండటంతో ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది ఈ సమస్యపై తక్షణమే స్పందించి, విద్యుత్ స్తంభాలకు చుట్టిన ప్రైవేట్ కేబుల్ వైర్లను తొలగించి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.అలాగే, భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ కేబుల్ నెట్‌వర్క్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, దుకాణదారులు మరియు ప్రజలు డిమాండ్ చేశారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…