
పార్క్ స్థలం అక్రమ నిర్మాణంపై తూతుమంత్రంపు కూల్చివేతల
రిఓకేషన్ పత్రం ఎక్కడ
మియపూర్ మదీనాగుడా విజయభారతి న్యూస్ ; మియపూర్ సర్కిల్ 48 పట్టణ ప్రణాళికల శాఖ అధికారులపై తీవ్ర విమర్శలు వెలువేతుతునప్పటికి మియాపూర్ డివిజన్ పరిధిలోని బి కే ఎన్క్లేవ్ లో ఒక అక్రమ నిర్మాణ షెడ్డును జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేశారు. మదినగూడ డివిజన్ పరిధిలోని మంజీరా పైప్ లైన్ రోడ్డులో ఓ వ్యక్తి పార్కు స్థలాన్ని కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నా దానిని పట్టించుకోకుండా జిహెచ్ఎంసి అధికారులు వివక్ష చూపుతున్నారని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల ప్రభావం చిన్నచిన్న షెడ్లపైనే చూపుతున్నారు. పెద్ద నిర్మాణాల పైన కానీ కబ్జాలు చేసే నిర్మిస్తున్న వారిని కన్నెత్తి కూడా చూడని జిహెచ్ఎంసి అధికారులు ఎవరికొమ్ముకాస్తున్నారు.
పట్టణాల్లో అక్రమ నిర్మాణాలు పెరగడం అనేది ప్రజలకు, అధికార యంత్రాంగానికి, పట్టణ ప్రాణాలిక సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. రహదారులు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజా ప్రయోజనాలకు కేటాయించిన ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అయితే అక్రమ నిర్మాణాలపై చర్యలు అందరికీ ఒకే విధంగా జరుగుతున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రాంతంలో చిన్న నిర్మాణాన్ని గుర్తించి వెంటనే నోటీసులు, కూల్చివేత చర్యలు చేపడుతుండగా మరో ప్రాంతంలో పెద్ద స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నప్పటికీ చర్యలు ఆలస్యం అవుతున్నాయి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది అధికారిక రికార్డులు, నోటీసులు, అనుమతులు, కోర్టు ఆదేశాలు, కూల్చివేత చర్యల వివరాల ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి అనుమానాలు ప్రజల్లో ఏర్పడితే అధికారులపై విశ్వాసం దెబ్బ తినే అవకాశం ఉందని ఆరోపణలు ఎదురవుతున్నాయి.
నిబంధన ఒకటి అయితే చర్య కూడా ఒకేలా ఉండాలి
అక్రమ నిర్మాణం చిన్నదా, పెద్దదా అన్నదానికంటే అది నిబంధనలకు విరుద్ధంగా ఉందా లేదా అనేది ప్రధాన ప్రమాణం కావాలి. అదే నిబంధన ఒక సామాన్య వ్యక్తి నిర్మాణానికి వర్తించి ప్రభావవంతమైన వ్యక్తి నిర్మాణానికి వర్తించకపోతే అది పాలనలో సమానత్వం పై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
పెద్ద నిర్మాణాలకు ఒక న్యాయం.. చిన్న నిర్మాణాలకు మరణ న్యాయమా? ప్రజల్లో ఎక్కువగా వినిపించే ఆరోపణ ఇదే. చిన్న వ్యాపారి లేదా సాధారణ కుటుంబం నిర్మించిన నిర్మాణం పై అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటారని, అదే సమయంలో పెద్ద ప్రాజెక్టులు లేదా ప్రభావవంతమైన వ్యక్తులకు సంబంధించిన నిర్మాణాలపై చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయని ఎవరైనా ఆరోపిస్తే దానికి అధికారులు పారదర్శకంగా సమాధానం ఇవ్వాలి.
