బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!

(విజయభారతి): ఉమ్మడి జిల్లా న్యూస్ ఆగస్టు 30

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బస్వాయి పల్లి గ్రామంలో దారుణం జరిగింది.ఫైనాన్సర్స్ వల్ల యువకుడు బలి అయ్యాడు.పిట్లం విఠల్ అనే యువకుడు కొత్తగా ఇల్లు కట్టుకోగ అప్పులయ్యాయి.ఇంటి పైన ప్రైవేట్ ఫైనాన్స్ లలో రుణం తీసుకున్నాడు.
కూలి పని చేస్తూ ఫైనాన్స్ డబ్బులు చెల్లించేవాడు. కొన్ని ఈఎంఐ లు డ్యూ కావడంతో ఈఎంఐ లు చెల్లించడానికి భార్య అనురాధ,ఇద్దరు పాపలు పావని,మైథిలి నీ తీసుకుని హైదరాబాద్ కు వలస వెళ్ళి నూతన భవనంలో కూలి పని చేస్తున్నారు.
వలస వెళ్ళిన కూడా కొన్ని ఈఎంఐ లు కట్టలేక బాకీ ( డ్యూ)కావడంతో ఫైనాన్స్ సిబ్బంది పూర్తిగా డబ్బులు కట్టలనీ వేధించడం ప్రారంభించారు.ఫైనాన్స్ సిబ్బంది ఇంటికి వచ్చి తాళం వేసి సీజ్ చేసి ఇల్లు అమ్మేస్తామని పక్కవారికి చెప్పి వెళ్ళిపోయారు.
అది తెలుసుకున్న పిట్లం విఠల్ హైదరాబాద్ నుండి తన స్వగ్రామానికి చేరుకు ని అత్త గారూ అదే గ్రామం కావడంతో అత్తగారింట్లో ఉన్నాడు.అవమానంగా భావించిన విఠల్ మనస్థాపంతో తన సీజ్ చేసిన ఇంట్లో తాళం వేసిన తలుపులు తెరిచి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఫైనాన్స్ లలో 13 లక్షల అప్పు తీసుకున్నట్లు భార్య పిట్లం అనురాధ తెలిపింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఫైనన్సర్ల వల్ల ఇద్దరు చిన్నారులు తండ్రిని కోల్పోయారు. పిట్లం అనురాధ భార్య, వైష్ణవి మృతుని చెల్లెలు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…