బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?

ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?

సమయపాలన పాటించని వైద్యులపై రోగులు ఆగ్రహం వ్యక్తం….

ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు తప్పని తిప్పలు….

ఎమర్జెన్సీ అయితే నిజామాబాద్‌కు వెళ్లాల్సిందేనా..?

ప్రభుత్వ ఆసుపత్రి ఉందా.. రిఫరల్ సెంటరా..?

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

శని, ఆదివారాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండరా…..

(విజయభారతి): ఆర్మూర్ న్యూస్: ఆగస్టు :30

సిస్టర్లతోనే పరీక్షలు.. వైద్యుల కోసం గంటల తరబడి నిరీక్షణ నెలలు నిండిన గర్భిణీలను సైతం పట్టించుకోరంటూ బంధువుల ఆవేదన కొన్ని పరీక్షలకు బయటకు.. అత్యవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రుల బాట! పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి.. ఆర్మూర్‌లో మాత్రం గర్భిణీ మహిళలకు ఇబ్బందుల కేంద్రంగా మారుతోందనే ఆరోపణలువినిపిస్తున్నాయి. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, సకాలంలో వైద్యుల పర్యవేక్షణ లభించడం లేదని గర్భిణీల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శని, ఆదివారాల్లో డాక్టర్లు ఎక్కడ..?ప్రభుత్వ ఆసుపత్రికి శనివారం, ఆదివారం కూడా అత్యవసర పరిస్థితుల్లో రోగులు వస్తూనే ఉంటారు. ముఖ్యంగా నెలలు నిండిన గర్భిణీ మహిళలకు ఏ సమయంలోనైనా ప్రసవ నొప్పులు రావచ్చు. పరీక్షల కోసం అటు ఇటు తిప్పుతూ నాన ఇబ్బందులుపెడుతున్నారు. అయితే అలాంటి సమయంలో వెంటనే వైద్యుల పర్యవేక్షణ, అత్యవసర చికిత్స అందాల్సి ఉంటుంది.అయితే సెలవు రోజుల్లో వైద్యుల అందుబాటుపై రోగుల బంధువులు ప్రశ్నలు సంధిస్తున్నారు. శని, ఆదివారం అయితే డాక్టర్ ఉండరా..? అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీకి ఎవరు వైద్యం చేస్తారు..? అంటూ నిలదీస్తున్నారు.సిస్టర్లతోనే చెకప్.. డాక్టర్ కోసం వెయిటింగ్ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు ముందుగా సిస్టర్లు పరీక్షలునిర్వహిస్తున్నారనిఅనంతరం వైద్యుల కోసం వేచి చూడాల్సి వస్తోందని పలువురుఆరోపిస్తున్నారువైద్యుడి ప్రత్యక్ష పర్యవేక్షణ కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.గర్భిణీ మహిళల ఆరోగ్య పరిస్థితిని సకాలంలో గుర్తించి వైద్యం అందించాల్సిన సమయంలో ఇలా నిరీక్షణ ఎందుకు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.నొప్పులువచ్చినాపట్టించుకోరా..?నెలలు నిండిన గర్భిణీ మహిళలకు నొప్పులు వచ్చినప్పుడు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అత్యవసరంగా వైద్య సేవలు అవసరమైన సమయంలో కూడా తగినంత స్పందన కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు.ప్రసవ సమయం దగ్గరపడిన మహిళను కూడా గంటల తరబడి వేచి ఉంచడం ఎంతవరకు సమంజసం?అని, పరీక్షల కోసం అటు ఇటు తిప్పుతున్నారని వాపోయారు.ఎమర్జెన్సీ అయితే..నిజామాబాద్‌కేనా?ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందుబాటులో లేకపోతే నిజామాబాద్‌కు వెళ్లాలని సూచిస్తున్నారని, మరికొన్ని సందర్భాల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు
అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రజలను ఇతర ఆసుపత్రులకు పంపించాల్సి వస్తే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఉద్దేశం ఏమిటి?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రి.. ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరల్ సెంటరా?కొన్ని వైద్య పరీక్షలను బయట ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాల్లో చేయించుకోవాలని సూచిస్తున్నారని కూడా రోగులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలపై అదనపు భారం పడుతోందని వాపోతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన వైద్య సేవలు అందించకుండా ఇతర ఆసుపత్రులకు పంపిస్తే.. పేద ప్రజలు ప్రభుత్వ వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నిస్తున్నారు. అధికారుల ఆకస్మిక తనిఖీలు అవసరం.ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో వైద్యుల హాజరు, గర్భిణీలకు అందుతున్న సేవలు, అత్యవసర ప్రసవాల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.గర్భిణీ మహిళల విషయంలో ఒక్క నిమిషం ఆలస్యం కూడా తీవ్రపరిణామాలకు దారితీసే అవకాశం ఉన్నందున,24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలుకోరుతున్నారు.“ప్రభుత్వ ఆసుపత్రి అంటే నమ్మకంతో వచ్చే పేదలకు భరోసా ఇవ్వాలి.. రిఫరల్ సెంటర్‌గా మార్చకూడదు అంటూప్రజలుఅధికారులను కోరుతున్నారు.డెలివరీ కోసం తీసుకొస్తే.. నిజాంబాద్ వెళ్ళమన్నారు రోగి బంధువులుహారిక బంధువులుమాట్లాడుతూడెలివరీ సమయం రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకంతో ఆర్మూర్‌కు తీసుకొచ్చాం. ఆసుపత్రికి వచ్చిన తర్వాత టెస్టులు చేయించుకోవాలని చెప్పి అటు ఇటు తిప్పారు. గర్భిణీకి ఇబ్బందులు ఉన్నా వెంటనే డాక్టర్ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోలేదు. చివరకు నిజామాబాద్‌కు వెళ్లాలని సలహా ఇచ్చారు.అయితే ప్రవేట్ హాస్పిటల్ కి వెళ్ళామనితెలిపారు.అత్యవసర సమయంలో ఇలా తిప్పడం వల్ల మాకు చాలా ఆందోళన కలిగింది” అని తెలిపారు.డాక్టర్ వివరణఈ ఘటనపై ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల వివరణతెలుసుకునేందుకుడాక్టర్‌నుసంప్రదించేందుకుప్రయత్నించగా,ఆదివారం కావడం తో డాక్టర్ అందుబాటులోకి రాలేదు.