Breaking News

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి.

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కె.శశాంక.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ( 62) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కె.శశాంక కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ,సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,,,ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.అంతే కాకుండా రాష్ట్ర ప్రజాపాలన నుండి జిల్లాకు వచ్చిన ఫిర్యాదులను కూడా వెనువెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు.వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని సూచించారు.ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల వివరాలను నమోదుకై రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు.

శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థినిలపై ఆగని అరాచకాలు

రిజిస్టర్ లో నమోదు చేయడం ద్వారా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి వాటిలో ఎన్ని పరిష్కరించడం జరిగిందని, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తుందని తెలిపారు.ప్రజావాణికి వచ్చేటప్పుడు ఆయా శాఖల జిల్లా అధికారులు రిజిస్టర్ తీసుకొని,ప్రజావాణి కార్యక్రుమానికి హాజరుకావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *