Breaking News

గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు: కమిషనర్ ఆమ్రపాలి

హైదరాబాద్, విజయ భారతి డెయిలీ :   గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం అడిషనల్, జోనల్ కమిషనర్లతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… నగరంలో శానిటేషన్ పక్రియను మెరుగుపరచి గార్బేజ్ ఫ్రీ సిటీగా చేయుటకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని శానిటేషన్ అడిషనల్ ను ఆదేశించారు. గతంలో శానిటేషన్ మెరుగుకు తీసుకున్న చర్యలు, ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యల పై ఫోకస్ చేయాలన్నారు. అవసరమైతే జోనల్ కమిషనర్లు, ఎస్.ఎస్.డబ్ల్యూ ఇంజనీర్లతో చర్చించి తుది నివేదికను రెండు రోజుల్లో అందజేయాలని శానిటేషన్ ఏసి ని కోరారు. మార్కెట్ ల వద్ద వ్యర్థాలను ఒకే చోట వేసే విధంగా డస్ట్ బిన్ లను ఏర్పాటు చేయాలనిచెప్పారు.కమర్షియల్ స్ట్రేచేస్ వద్ద లిట్టర్ బిల్ లను ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో జోనల్ లెవెల్ లో పూర్తిస్థాయిలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టి పూర్తయిన నేపథ్యంలో కాంట్రాక్టర్ వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించే విధంగా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. గార్బేజ్ ఫ్రీ సిటీ లో ఇతర శాఖల సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. జిహెచ్ఎంసి వ్యాప్తంగా కాంట్రాక్టర్ లు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు జోనల్ స్థాయిలో కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి పనులు పూర్తి చేసే విధంగా కృషి చేయాలని జోనల్ కమిషనర్ లకు కమిషనర్ ఆదేశించారు. పనులు పూర్తి కాకపోవడానికి గల కారణాలు వివరాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. అంతేకాకుండా ప్యాకేజీ పరంగా టెండర్లు పిలిస్తే పనులు వేగవంతంగా అయ్యే అవకాశాల పై కూడా ఆలోచించాలని జోనల్ కమిషనర్  కోరారు.కమర్షియల్ కాంప్లెక్స్ లకు సంబంధించి ఆస్తి పన్ను చెల్లింపులు డిప్యూటీ కమిషనర్లు వెళ్లినప్పుడు అక్కడ శానిటేషన్ పరిస్థితి పరిశీలించి లిట్టర్ బిన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వచ్ఛ ఆటో వాహనాలు  జిపిఎస్ లింక్ ఇచ్చినందున రూట్ మ్యాప్ తయారు చేసి స్వచ్ఛ ఆటో రూట్ మ్యాప్ ప్రకారంగా ఇంటింటికి చెత్త సేకరణ పూర్తి స్థాయిలో చేసే విధంగా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లు ఆదేశించారు. నీటి వనరుల వద్ద, నాలాల వద్ద కూడా ఫ్లోటింగ్ మెటీరియల్ తొలగింపుకు చర్యలు తీసుకోవాలని గార్బేజ్ ఫ్రీ సిటీ గా ఉండటానికి ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కమిషనర్ అధికారులను కోరారు.

శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థినిలపై ఆగని అరాచకాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *