కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లపుడు నిలుస్తుంది –
జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ; మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిదేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. చిన్న చిన్న వ్యాపారాలకు లోన్లు మంజూరు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు.
సోమవారం రోజు చందనగర్ మున్సిపల్ కార్యాలయంలో 8.00 లక్షల రూపాయల రుణంతో ఏర్పాటు చేసిన ఇందిర మహిళ శక్తి క్యాంటీన్ ను ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పిఎసి చైర్మన్ అరేకపూడి గాంధీ, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, చందనగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, మియపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డిప్యూటీ కమీషనర్ మోహన్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ వత్సల దేవి, ఇతర జి.హెచ్.ఎం.సి అధికారులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులతో కలిసి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం మహిళ శక్తి పథకం ఆర్థిక చేయూతనందించి ప్రోత్సహిస్తుందన్నారు. మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు సయ్యద్ గౌస్, మిరియాల రాఘవరావు, మాజీ కౌన్సిలర్ రవీందర్, ఉరిటీ వెంకట్ రావు, కట్ల శేఖర్ రెడ్డి, అక్తర్, హనీఫ్, వెంకటేష్, సుధాకర్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.