కూకట్ పల్లి విజయ భారతి న్యూస్ ;
కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మంగళవారం రోజు కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ని మూసాపేటలోని జోనల్ కార్యాలయంలో స్థానిక నాయకులతోపాటు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమేష్ మున్సిపాలిటీలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను జనరల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపల్ పరిధిలో గతంలో అనుమతులు పొంది కొనసాగుతున్న పనుల తోపాటు కొత్తగా చేయాల్సిన పనులపైనా వాటి కోసం నిధుల విడుదల పైనా ఇరువురు చర్చించారు. కొనసాగుతున్న పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ భేటీపై రమేష్ మాట్లాడుతూ. నియోజకవర్గ పరిధిలో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని వాటిని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.కూకట్ పల్లి విజయ భారతి న్యూస్ ;
కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మంగళవారం రోజు కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ని మూసాపేటలోని జోనల్ కార్యాలయంలో స్థానిక నాయకులతోపాటు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమేష్ మున్సిపాలిటీలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను జనరల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపల్ పరిధిలో గతంలో అనుమతులు పొంది కొనసాగుతున్న పనుల తోపాటు కొత్తగా చేయాల్సిన పనులపైనా వాటి కోసం నిధుల విడుదల పైనా ఇరువురు చర్చించారు. కొనసాగుతున్న పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ భేటీపై రమేష్ మాట్లాడుతూ. నియోజకవర్గ పరిధిలో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని వాటిని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
