హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ దాడులు చేపట్టారు. గత కొంతకాలంగా గ్యాప్ ఇచ్చిన ఐటీ అధికారులు మరోసారి దాడులు చేపట్టారు. మంగళవారం రోజు ఉదయం హైదరాబాద్ వ్యాప్తంగా 8 చోట్ల ఐటి సోదరులు చేపట్టారు. మంగళవారం రోజు ఉదయం కుకట్పల్లి రెయిన్ బో విస్టా, మాదాపూర్, బషీర్ బాగ్ లో ఓ ఫైనాన్స్ కంపెనీతో పాటు పలుచోట్ల ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ యజమాని, ఓ న్యూస్ ఛానల్ ఎండి ఇంట్లో తెల్లవారుజాము నుండే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. బషీర్ బాగ్ లో పైగా ప్లాజాలోని 2, 3, 4 అంతస్తులలో ఐటి అధికారులు మీడియాని అనుమతించకుండా భారీ ఎత్తున సోదరులు నిర్వహిస్తున్నారు.
