Breaking News

విధులు ఒకచోట పైరవీలు మరోచోట

టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అతనికి ప్రత్యేక స్థానం

చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న్ ఉన్నతాధికారులు

ఇతని తీరుపై సర్వత్ర చర్చ

దాదాపుగా రెండు దశాబ్దాలు ఒకేచోట తిష్ఠ

ఎన్నిసార్లు బదలాయించిన చందానగర్ సర్కిల్ పై ప్రత్యేక మోజు

అదేంటో అంతుచిక్కని ‘శ్రీనివాస్’ రహస్యం

శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; విధులు ఒకచోట పైరవీలు మరోచోట ఇటీవల శేరిలింగంపల్లి జంట సర్కిల్లలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిని వివిధ సర్కిల్ లకు బదిలీ చేశారు. అయినప్పటికీ దశాబ్దాల కాలంగా ఉన్న ఓ ప్రైవేటు ఉద్యోగి చందానగర్ సర్కిల్ 21 పరిధిలో ఉన్న బిల్డర్లను తన ఆధీనంలో ఉంచుకొని నేటికీ ఉన్నత స్థాయి అధికారులతో పైరవీలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తుంది. వడ్డించేవాడు మనవాడు అయితే ఏ మూలన కూర్చున్న సకల మర్యాదలు అందుతాయన్న చెందాగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పటాన్చెరువు కు బదిలీ అయిన ప్రైవేటు ఉద్యోగి ప్రవీణ్ కుమార్ అలియాస్ “గడ్డం శ్రీను”అటు ఉద్యోగం చేస్తూనే చందానగర్ సర్కిల్ 21 లో తనకు అనుకూలంగా ఉన్న బిల్డర్ లతో సంప్రదింపులు జరుపుతూ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాగా తన వ్యాపారాన్ని నడిపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రిపోర్టర్లకు అక్రిడేషన్ ఉంటేనే ఎలక్షన్ వివరాలు ఇస్తారట…

చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు : – శేరిలింగంపల్లిలోని జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్ -21 లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది శ్రీనివాస్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, అధికారులు అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏళ్ల తరబడి జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్- 21లో ఒకేచోట తిష్ఠ వేసిన తను ఆడిందే ఆటగా,పాడిందే పాటగా సాగింది. కేవలం సర్కిల్ లోని టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేరి నేడు జిహెచ్ఎంసి సర్కిల్ -21 నే తన గుప్పెట్లో పెట్టుకొని పెత్తనం చాలాయిస్తున్నాడని తోటి సిబ్బంది మండిపడ్డ సంగతి అందరికీ తెలిసిందే. జిహెచ్ఎంసి లోని అన్ని శాఖలకు తానే అధిపతిగా వ్యవహరిస్తూ ఇక్కడ ఏ చిన్న పని జరగాలన్న అతని చల్లని చూపు, ఆశీస్సులు అనుమతి తీసుకోవాల్సిందేనని బాధితులు అనేవారు. ఎంతలా అంటే కనీసం డీసీ దగ్గరకు వెళ్లే దారులు సైతం ఇతని వైపుకు మళ్లుతాయని అనేవారు అతని బాధితులు. సర్కిల్ లో ఇతన్ని కలవాలంటే “నమో శ్రీనివాసా” అంటూ కలవాల్సిందే. లేదంటే ఏ పని జరగదు అనేది చందా నగర్ సర్కిల్ మొత్తం పుకార్లు షికార్లు కొడుతున్నాయంటే ఇతని హవ ఏ రేంజ్ లో కొనసాగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని స్థానికలు వాపోయారు. ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంతకీ ఎవరి శ్రీనివాస్…?

చూసేందుకు చెరిగిన జుట్టు, నెరిసిన గడ్డంతో సాదా సీదాగా చాలా అమాయకంగా, ఎవరైనా ఇతని చూస్తే.. అయ్యో పాపం అనేలా కనిపిస్తాడు ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అతని అసలు విశ్వరూపం, వ్యవహారా శైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తగ్గేదెలే అనేలా ఉంటుంది. ఎప్పుడో పుష్కరకాలం క్రితం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ఔట్సోర్సింగ్ సిబ్బందిగా చేరి అంచలంచలుగా ఎదిగి అందరిని తన వైపు ఆకర్షించుకొని తను లేనిదే ఇక్కడ ఎలాంటి పనులు జరగవు అనే విధంగా సర్కిల్-21 లో తన ప్రభావాన్ని కొనసాగిస్తూ.. కిందిస్థాయి సిబ్బంది మొదలుకొని డీసీ వరకు అతనికి అందరు ‘జీ’ హుజుర్ అనేలా నేడు ముక్కున వేలేసుకుని పోయినట్లుగా చందానగర్ జిహెచ్ఎంసిలో తన ఆధిపత్యాన్ని ఇంకా కూడా కొనసాగిస్తున్నాడు.

టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ పెత్తనం…!?

టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అతని మాటే శాసనం.ఎవరికి ఏ పని కావాలన్నా నేను ఉన్న అంటూ మొత్తం అన్ని తనై వ్యవహరిస్తూ..అటు అధికారులకు, జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సిబ్బందికి కొరకరాని కొయ్యగా తయారైయ్యాడని అనేక సార్లు విధుల నుంచి తొలగించారు. కానీ అంతే వేగంగా అతనికి ఉన్న పరిచయాలు, పలుకుబడితో మళ్ళీ అదే స్థానంలో యధావిధిగా తిష్ఠవేసుకొని తిరిగి విధులు నిర్వర్తిస్తున్న తిరునుచూస్తే శ్రీనివాస్ ‘మాయ’ ఏమిటో అంతు చిక్కటం లేదని పలువురు వాపుతున్నారు.

జోనల్ కమిషనర్ ఆదేశాలు సైతం బేఖాతరు …
తాజాగా శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ ఇతని వ్యవహారంపై సీరియస్ అయ్యారని సమాచారం. ఇతని ఆగడాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సదరు సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించినట్లు తెలిసింది. అయినా ఎందుకో మరి కొంతమంది కిందిస్థాయి అధికారులు ఇతన్ని వెనకేసుకొస్తున్నారని విశ్వసనీయ సమాచారం. కమిషనర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఇతన్ని పెంచి పోషించడంలో ఆంతర్యమేమిటో వారికే తెలియాలని సర్కిల్ ప్రజలు పెదవి విరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *