బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

అక్రమ నిర్మాణాలపై హైడ్ర హుక్కు పాదం

అక్రమ నిర్మాణాలపై హైడ్ర హుక్కు పాదం

అనుమతులు లేని భవనాలను కూల్చి వేస్తున్న హైడ్రా అధికారులు

శేరిలింగంపల్లి మాదాపూర్ విజయభారతి న్యూస్ ; అందరికీ వీకెండ్‌ బ్రేక్‌ ఉంటుందేమో కాని తమకు మాత్రం 24/7 ఆన్ డ్యూటీ చేస్తాను అంటోంది హైడ్రా. ఇప్పటికే అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా… మరోసారి అదే స్పీడును కొనసాగిస్తూ మాదాపూర్ డివిజన్ పరిధిలో గల అయ్యప్ప సొసైటీ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. మాదాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న అయ్యప్ప సొసైటీ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా అధికారులు కూల్చివేయడానికి రంగం సిద్ధం చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల బిల్డింగ్ ను కూల్చేశారు. ఆదివారం రోజు హైడ్రా అధికారులు అయ్యప్ప సొసైటీ వద్దకు పోలీసుల బందోబస్తు భద్రతల అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని కూల్చివేతలు ప్రారంభించారు. కూల్చివేస్తున్న భవనం రోడ్డు పక్కనే ఉండటంతో పవర్ సప్లై నిలిపివేసి ఇలాంటి ఘటనలు జరగకుండా కూల్చివేశారు. భవనాన్ని కూలుస్తున్న సమయంలో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రూల్స్ పట్టించుకోకుండా ఉన్న ఏ నిర్మాణాన్నైనా కూల్చేస్తామని హైడ్రా అధికారులు ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. అయినా కూడా కొంతమంది వాటిని పెడ చెవిన పెడుతున్నారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో నిర్మించిన భవం కూడా రూల్స్ను అతిక్రమించి కట్టినదే. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్, గ్రౌండ్ తో పాటూ 5 అంతస్తు భవనాన్ని నిర్మిస్తున్నారని అక్కడ స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల మేరకు ఆ భవనాలను పరిశీలించిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

అయ్యప్ప సొసైటీలో హైడ్రా అడుగుపడితే ప్రభుత్వాన్ని కుల్చివేస్తాం – బిల్డర్లు
గతంలో కొంతమంది అయ్యప్ప సొసైటీలోకి హైడ్రా అడుగుపెడితే అధికారుల సంగతేందో చూస్తామని ప్రభుత్వాన్ని కూడా వెనకడుగు వెయ్యమని సవాల్ విసిరారు. కానీ హైడ్రా వాళ్ళ సవాల్ ని స్వీకరిస్తూ ఆదివారం రోజు అయ్యప్ప సొసైటీలో కూల్చివేతల శ్రీకారం చుట్టింది. అయితే బిల్డర్ల ఒత్తిడికి హైడ్రా వెనకడుగు వేస్తుందా లేక హైడ్రా ఇదే దుకుడిని ప్రదర్శిస్తుందా తూ..తూ..మంత్రంగా వ్యవహరిస్తుంద అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. అంతే కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చల విడిగా 5 నుండి 9 అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి వాటి సంగతి ఏంటని అక్కడి ప్రజలు హైడ్రా ను ప్రశ్నిస్తున్నారు.