
విజయభారతి : హైదరాబాద్ Jul 04, 2026,
మెట్రోపై మరోసారి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ?
తెలంగాణ : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణపై ఇటీవల కేంద్ర మంత్రులను కలిసి చర్చించినా ఎలాంటి స్పందన రాకపోవడంతో దీనిపై స్పీడు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాప్యంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మెట్రో రైలు ప్రాజెక్టుపై శుక్రవారం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వ్యయాల అంచనా కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించాలని గత మీటింగ్లో నిర్ణయించారు. దీనిపై ఎస్‌బీఐ క్యాప్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
