బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

బీసీల అభ్యున్నతే దొడ్డి కొమురయ్య ఆశయాలకు నిజమైన గౌరవం..

సామాజిక న్యాయం కోసం ఆయన పోరాటం చిరస్మరణీయం..

దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఐ డి ఓ సిలో నిర్వహించిన కార్యక్రమంలో.

బీజేపీ నేత , తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు , బీసీ సాధికారత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్..

విజయభారతి :నిజామాబాద్, జూలై 4:

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ( ఐ డి ఓ సి)లో నిర్వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ నేత, తెలంగాణ బీసీ–ఎస్సీ–ఎస్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు, బీసీ సాధికారత సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సాపూర్ శంకర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సహా బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. యువత దొడ్డి కొమురయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి సాయి కుమార్, నూడా ( NUDA ) చైర్మన్ కేశ వేణు , CPI (ML ) నేత ప్రభాకర్ , దేవారం అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి భాగ్యలక్ష్మి, బీసీ నేత మయవర్ రాజేశ్వర్ , బీసీ సాధికారత సంఘం జిల్లా అధ్యక్షుడు మిరియాల సురేశ్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మేక సునంద, అర్సపల్లి గంగాధర్, కబుతార్ శంకర్ , హరి ప్రసాద్ , గోపి యాదవ్ , కల్యాణి , మంజుల తదితరులు పాల్గొని దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు.