Breaking News

హౌసింగ్ బోర్డ్ కాలనీలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం…

విజయభారతి : ఆర్మూర్ న్యూస్

ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు పూజా నరేంద్ర ఆధ్వర్యంలో కాలనీ వాసులకు ఎస్‌ఐఆర్ పత్రాలపై అవగాహన కల్పించారు. నూతన ఓటరు నమోదు, ఓటరు వివరాల సవరణకు సంబంధించిన ఎస్‌ఐఆర్ పత్రాలను నింపించి సంబంధిత అధికారులకు అందజేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పూజా నరేంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

బీసీల అభ్యున్నతే దొడ్డి కొమురయ్య ఆశయాలకు నిజమైన గౌరవం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *