
విజయభారతి :ఆర్మూర్, జూలై 4 :
ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) రాజ గంగారం శనివారం తనిఖీ చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, బోధన విధానం, మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా విజయ్ హై స్కూల్, నలంద హై స్కూల్, అల్ఫోర్స్ హై స్కూల్, లిల్లీ పుట్ స్కూల్‌లను సందర్శించి తరగతి గదులు, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధన తదితర అంశాలను పరిశీలించారు.
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని ఎంఈఓ రాజ గంగారం సూచించారు. విద్యా బోధనలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల పరిశుభ్రత, భద్రత, క్రమశిక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని పేర్కొన్నారు.
ఈ తనిఖీల సందర్భంగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
