Breaking News

మహేశ్ గౌడ్ ను సవాల్ చేసే స్థాయి రాకేశ్ రెడ్డికి లేదు…

కమ్మర్ పల్లి మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మ..

విజయభారతి: కమ్మర్ పల్లి న్యూస్.

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పై సవాల్ విసిరే స్థాయి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డికి లేదని కమ్మర్ పల్లి మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మ అన్నారు. మహేశ్ గౌడ్ పై రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె శనివారం మాట్లాడుతూ.. అభివృద్ధి చేయలేక ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న రాకేశ్ రెడ్డి ప్రస్టేషన్ లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని అంజమ్మ ఎద్దేవా చేశారు. హూందా రాజకీయాలకు, అభివృద్ధికి మారుపేరుగామహేశ్ గౌడ్ పైనా, నిజాయితీకి, నిబద్ధతకు నిలువెత్తు ఆదర్శంగా నిలుస్తున్న ఇద్దరు బీసీ నేతల ఎదుగుదలను ఓర్వలేక అవాకులు చెవాకులు వాగుతున్నారని మండిపడ్డారు. మహేశ్ గౌడ్ తన సొంత గ్రామంలో తన సొంత నిధులతో అభివృద్ధి చేసి జన్మనిచ్చిన ఊరి రుణం తీర్చుకున్నాడని, మరి అంకాపూర్ కు నువ్వేం చేశావో చెప్పాలని అంజమ్మ రాకేశ్ రెడ్డిని ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల్లో ఆదరణ తప్ప ఆస్తులు సంపాదించుకోలేని సౌమ్యుడు అనిల్ ఈరవత్రిపై చేసిన వ్యాఖ్యలపై కూడా ఆమె స్పందించారు. ప్రజాసేవలో ఎన్నో యేళ్లుగా ప్రజాసేవలో ఉంటూ, ప్రజలతో మమేకమైన మహేశ్ గౌడ్ , అనిల్ ఈరవత్రి లెక్కడా, ఎన్నికల కోసమే సూట్ కేసుతో వచ్చి డబ్బులతో టికెట్ కొనుక్కున్న నువ్వెక్కడ అన్నారు. ఇప్పటికైనా స్థాయికి మించిన నేతలపై విమర్శలు చేయడం, సవాళ్లు విసరడం మానుకోవాలని హితవు పలికారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు నువ్విచ్చిన హామీలను నెరవేర్చే పనులపై దృష్టి పెట్టాలని గుడిసె అంజమ్మ రాకేశ్ రెడ్డికి చురకంటించారు. ఇప్పటికైనా హూందా రాజకీయాలు చేయాలని, ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చేలా వ్యవహరించొద్దని అంజమ్మ అన్నారు.

ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా…రైతు సంక్షేమానికి పెద్దపీట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *