బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

బాలనగర్ పాఠశాల విద్యార్థులకు చేతివ్రాత పుస్తకాల పంపిణీ

విజయభారతి : జక్రాన్ పల్లి న్యూస్

జక్రాన్‌పల్లి మండలం, బాలనగర్: జక్రాన్‌పల్లి మండలంలోని బాలనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో కల్కి గ్రిట్ ఫోర్స్ (కేజీఎఫ్) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు తెలుగు, ఆంగ్ల చేతివ్రాత పుస్తకాలను పంపిణీ చేశారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థికి ఈ పుస్తకాలను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ కొమిరే రాజు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తే వారి భవిష్యత్తు బంగారుమయమవుతుందని అన్నారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.కార్యక్రమ అధ్యక్షుడు మనోజ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై మరిన్ని అవగాహన కార్యక్రమాలను చేపడతామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి సంస్థ ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మాధురి, మహేష్, నాగేందర్, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు సునీత, సుజాత, విట్టల్ రావు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…