Breaking News

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును కాపాడాలి…. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును కాపాడాలి

తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ

విజయభారతి ; హైదరాబాద్ న్యూస్

ఆలూరులో ప్రీ-ప్రైమరీ ఆయాల ఎంపికకు 1:3 జాబితా విడుదల…

తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నెలల నుండి ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ జరుగుతున్న సందర్భంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు, పౌర సమాజం, యువజన సంఘాలు, విశ్రాంత ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, సామాజిక చైతన్య సంస్థలు, వేదికలు, వాకర్ సంఘాలు, అత్యంత జాగ్రత్తతో 18 సంవత్సరాల పైబడిన యువతీ యువకుల నుండి అత్యంత వృద్ధులైన వారి ఓట్లను కాపాడవలసిన బాధ్యతను గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. మంగళవారం హనుమకొండ ప్రెస్ క్లబ్బులో ఎస్ ఐ ఆర్ సమస్యలపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ధనవంతులు ఓటు హక్కును
ఉపయోగిస్తారని కేవలం పేద వర్గాలు మాత్రమే ప్రభుత్వాల తలరాతలు నిర్ణయిస్తారని అలాంటి ఓట్లు జాబితా నుండి గల్లంతు కాకూడదని అన్నారు. సంక్లిష్టమైన ఓటర్ నమోదు ఫారం నింపే అవగాహన లేని ఓటర్లు అత్యధికంగా ఉన్న విషయాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారులు, నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారులు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ జనాభాలో 15 శాతం ఉన్న వృద్ధుల ఓట్లు, ఆర్థికంగా సామాజికంగా పేద వర్గాల ఓట్లు ప్రజాస్వామ్యం మనగడకు కీలక పాత్ర పోషిస్తాయని విషయాన్ని ఎలక్షన్ అధికారులు, సిబ్బంది పౌర సమాజం నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. పేద వర్గాల అభివృద్ధి సంక్షేమం కొరకే రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం వ్యవస్థల నిర్మాణం జరిగిందని అందులో ఓటర్ల జాబితా సవరణ అత్యంత ప్రాధాన్యత కలిగిందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారని, అందుకే పేదలు, దనికులు అక్షరాస్యులు నిరక్షరాస్యులు అనే విచక్షణ లేకుండా 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరునికి అంబేద్కర్ ఓటు హక్కు కల్పించారని అన్నారు. దేశంలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం నడుస్తున్న క్రమంలో అనేక అవకతవకలు వాస్తవ ఓటర్లను ఓటర్ల జాబితాలో కనిపించకుండా పోయిన కథనాలు ఎన్నో బీహార్ పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో చోటు చేసుకున్నాయని కథనాలు అనేకం వెలువడ్డాయని అన్నారు. ఓటర్ నమోదు కార్యక్రమాలలో జరిగిన అక్రమాలతో కొన్ని రాష్ట్రాలలో పార్టీల తలరాతలు కూడా మారాయని పత్రికలు, ఇతర మీడియా సంస్థలు ప్రజాస్వామ్యవాదులు గగ్గోలు పెడుతున్న విషయాలను విస్మరించరానివని అన్నారు. గ్రామాల నుండి పట్టణాలకు పట్టణాల నుండి నగరాలకు లక్షలాదిమంది ఓటర్లు పౌరులు ఉద్యోగ ఉపాధి రీత్యా వలసలు వెళుతున్న పరిస్థితులలో ప్రత్యేక ఓటరు నమోదులో తప్పిపోయే ప్రమాదం కూడా పొంచి ఉందని ఓటర్ ఫామ్స్ నింపడానికి సరైన అవగాహన లేని ఓటర్లు అత్యధికంగా ఉన్న మన సమాజంలో ఎన్నికల సమయానికి పేదల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షులు పుల్లూరు6సుధాకర్ మాట్లాడుతూ ఓటరు చైతన్యం లేకపోవడం వల్ల జరిగే అనర్ధాలు అవకతవకలు చోటు చేసుకుంటాయని పౌర సమాజం జాగ్రత్తగా సహకరించి ప్రజాస్వామ్య వ్యవస్థలను రాజ్యాంగ హక్కులను కాపాడడానికి అన్ని పౌర సంఘాలు చైతన్యంతో నిబద్ధతతో కృషిచేయాలని అన్నారు. బోగస్ ఓట్ల తొలగింపు ఒకే వ్యక్తికి రెండు లేదా మూడు ప్రదేశాలలో ఉన్న ఓట్ల తొలగింపు లాంటివి చేసినప్పటికీ వాస్తవిక ఓటర్లకు అన్యాయం జరగకూడదని ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడకూడదని అందులో పౌర సమాజమే ప్రముఖ పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు బొమ్మినేని పాపిరెడ్డి, బి.సి ముస్లిం అసోసియేషన్ నాయకులు డాక్టర్ రాజ్ మహ్మద్, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు వీరమల్ల బాబురావు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, శాంతి సంఘం నాయకులు దొమ్మాట ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *