బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

విద్యారంగ సమస్యల పరిష్కారానికి యూఎస్ఎఫ్‌ఐ చలో ప్రజాభవన్ ముట్టడి విజయవంతం……. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి డిమాండ్…. యూఎస్ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సిద్ధాల నాగరాజు…..

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

విజయభారతి : హైదరాబాద్ న్యూస్ జూలై 10

తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమం విజయవంతంగా జరిగింది.పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఎంఈఓ, డీఈఓ ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు కేటాయించాలని కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా యూఎస్ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సిద్ధాల నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. గురుకుల విద్యార్థులు సొంత భవనాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేసి, విద్యారంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్‌ఐ విద్యార్థి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.