విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుంది
-బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ భోగ శ్రావణి.


చల్‌గల్‌లో కేవి కి 5 ఎకరాల కేటాయింపు బీజేపీ పోరాట ఫలితమే
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
మరో 5 ఎకరాలు స్థలం కోసం ఉద్యమిస్తాం.
విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుంది
-బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ భోగ శ్రావణి.
విజయభారతి :జగిత్యాల, న్యూస్ ; జులై 10:
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు చల్‌గల్ వాలంతరీ సెంటర్‌లో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.158ను బీజేపీ స్వాగతిస్తున్నట్లు జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డా. భోగ శ్రావణి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, ధర్మం, న్యాయం కోసం బీజేపీ చేసిన పోరాటానికి దక్కిన ఫలితమే ఈ నిర్ణయమని అన్నారు. శుక్రవారం కమల నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు చల్‌గల్ వాలంతరి సెంటర్ ప్రాంతమే అనుకూలమని కేంద్రియ విద్యాలయ సంఘటన్ అధికారులు గుర్తించారని అన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెబుతున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారణంగానే సంవత్సరం కాలయాపన జరిగిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్వార్థపూరితంగా తనకు భూములు ఉన్న చోట కెవి ఏర్పాటు కు స్థలాలు ప్రపోజ్ చేస్తే స్థల పరిశీలనకు వచ్చిన అధికారులు వాటిని తిరస్కరించినట్లు గుర్తు చేశారు. కేంద్రీయ విద్యాలయాన్ని చల్‌గల్ లోనే ఏర్పాటు చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ చేపట్టిన నిరాహార దీక్షను ఎమ్మెల్యే పోలీసులతో అడ్డుకోవడమే కాకుండా బీజేపీ మహిళా నాయకులని కూడా చూడకుండా అరెస్టు చేసి చేయించి లాక్కెల్లేలా చేసారని ఆరోపించారు. అయితే చివరికి బీజేపీ నాయకుల పోరాట ఫలితంగా విద్యార్థుల ప్రయోజనాలే గెలిచాయని వ్యాఖ్యానించారు. కాగా ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని కేటాయించడం స్వాగతించదగ్గ నిర్ణయమే అయినప్పటికీ, పూర్తి స్థాయి కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాల స్థలం అవసరమని శ్రావణి అభిప్రాయపడ్డారు. క్రీడా మైదానం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతర మౌలిక వసతుల కోసం అదనంగా మరో ఐదు ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జూలై 12న ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో కేవీ ఏర్పాటు కు భూమిపూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేంద్రీయ విద్యాలయం మంజూరుకు కృషి చేసిన ఎంపీ అరవింద్‌తో పాటు, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భూమి కేటాయింపుకు సహకరించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు పార్టీ నాయకులు ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత,42వ వార్డ్ కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, జిల్లా కార్యదర్శులు పాత రమేష్, ముత్యంరెడ్డి, కాశెట్టి తిరుపతి,పూదరి శ్రీనివాస్, బద్దెల గంగరాజం మరియు తదితరులు పాల్గొన్నారు.
