బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

మచర్ల జడ్పీహెచ్ఎస్‌కు 25 డ్యూయల్ డెస్క్ బెంచీల విరాళం…

విజయభారతి : ఆలూరు న్యూస్ జూలై 10

ఆలూర్ మండలంలోని మచర్ల గ్రామ సర్పంచ్ కట్ట నర్సయ్య విజ్ఞప్తికి స్పందించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎన్నారై, సమాజ సేవకుడు రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలోని రామ్ నోముల ట్రస్ట్ తరఫున 25 డ్యూయల్ డెస్క్ బెంచీలను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కట్ట నర్సయ్య మాట్లాడుతూ, రామ్ నోముల ట్రస్ట్ మచర్ల గ్రామ అభివృద్ధికి ఎప్పటికప్పుడు సహకరిస్తోందన్నారు. గతంలో గ్రామంలో వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు చేయడంతో పాటు అదనపు తరగతి గది నిర్మాణానికి కూడా నిధులు అందించిందని గుర్తు చేశారు. జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలలకు విద్యా సదుపాయాల కల్పనలో ట్రస్ట్ చేస్తున్న సేవలు ఆదర్శనీయమని పేర్కొంటూ రాంచంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మండల విద్యాధికారి ఎం. నరేందర్ మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన విద్యాభ్యాస వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కొత్త డెస్క్ బెంచీలతో విద్యార్థులు సౌకర్యవంతంగా చదువుకునే అవకాశం ఏర్పడిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…