బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

మైనర్ల చేతికి స్టీరింగ్ కాద బాధ్యత తల్లిదండ్రులదే..!ఆర్మూర్‌లో మోటారు వాహనాల తనిఖీలు ముమ్మరం… మైనర్ల డ్రైవింగ్‌పై ఎంవీఐ రాహుల్ కుమార్ హెచ్చరిక…

విజయభారతి – ఆర్మూర్ న్యూస్ | జూలై 14

ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో మైనర్లు వాహనాలు నడపకుండా అరికట్టేందుకు రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టిందని మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) ఈ. రాహుల్ కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు ద్విచక్ర లేదా నాలుగు చక్రాల వాహనాలు నడిపేందుకు అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే మోటారు వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 199A ప్రకారం వాహన యజమాని లేదా సంరక్షకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ నిబంధనల ప్రకారం రూ.25 వేల వరకు జరిమానా, జైలు శిక్ష, వాహనం రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేయడం వంటి చర్యలు ఉండవచ్చని తెలిపారు. అలాగే నేరానికి పాల్పడిన మైనర్‌కు 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయరాదనే నిబంధన కూడా అమలులో ఉంటుందని వివరించారు.
ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మైనర్లు నడిపిన వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు, సంబంధిత వాహన యజమానులు, తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎంవీఐ ఈ. రాహుల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ప్రమాద రహిత, సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…