Breaking News

పెర్కిట్ జడ్‌పీహెచ్‌ఎస్‌లో సామాజిక తనిఖీ…. నిర్వహణ పాఠశాల రికార్డులు, మౌలిక వసతులు పై ….. విద్యార్థులకు అందుతున్న సేవలపై జిల్లా విద్యాశాఖ అధికారిణి హరిణి సమగ్ర పరిశీలన….

విజయభారతి ఆర్మూర్ న్యూస్, జూలై 14:

మామిడిపల్లిలో ఈ-ఎఫ్ డిజిటలైజేషన్ పురోగతిపై సబ్ కలెక్టర్ సమీక్ష….

ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ (సర్వ శిక్షా అభియాన్) అధికారిణి హరిణి గురువారం ఉదయం పాఠశాలకు చేరుకుని ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలో విద్యా, పరిపాలనా వ్యవస్థపై సమగ్ర తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లు, మధ్యాహ్న భోజన (ఎండీఎం) రికార్డులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, పేరెంట్స్-టీచర్స్ మీటింగ్, స్టాఫ్ మీటింగ్ రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, వంటగది, బాలురు, బాలికల మరుగుదొడ్ల పరిశుభ్రతను తనిఖీ చేశారు.
విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్‌షిప్‌లు, క్రీడా సామగ్రి, పాఠశాల గ్రాంట్ల వినియోగం, ఉచిత నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాల పంపిణీ రికార్డులు, విద్యార్థుల ఫిర్యాదుల రిజిస్టర్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్య, కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు, రోజువారీ హాజరు, పాఠశాలలో అమలవుతున్న ఆరోగ్య శిబిరాలు, అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.
పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అవసరమైన సూచనలు చేశారు.వఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *