Breaking News

చిన్ననాటి మిత్రుల ఆత్మీయ కలయిక…. ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో చేనేత వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం….

(విజయభారతి )ఆర్మూర్, న్యూస్ ఆగస్టు 02

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గ్రామానికి చెందిన చిన్ననాటి మిత్రులు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒకేచోట చేరి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన చేనేత సహకార సంఘ ఎన్నికల్లో డైరెక్టర్‌గా విజయం సాధించి, అనంతరం చేనేత వైస్ చైర్మన్‌గా ఎన్నికైన తమ క్లాస్‌మేట్ మిత్రుడికి ఘనంగా శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, చిన్ననాటి స్నేహబంధం జీవితాంతం నిలిచేగొప్పఅనుబంధమని, అందరం ఒకే చోట చేరి ఫ్రెండ్షిప్ డేను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమ మిత్రుడు చేనేత రంగంలో కీలక బాధ్యతలు చేపట్టి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లిక్కి శంకర్, టీఆర్ఎస్ జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు అల్లూరి గంగారెడ్డి, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ మామిడి భూపత్ రెడ్డి, ఏవి రమణ, గుండె మోహన్, ఆరే లింబాద్రి, నాగుల శ్రీధర్ గౌడ్, పాలెం చిన్న నాగరాజు, వెంచర్యాల రవీందర్ రెడ్డి, భూమిని రాజేందర్, పసుపుల భూమేశ్వర్, పిట్టల ప్రభాకర్, వరలక్ష్మి రాజేందర్ తదితర క్లాస్‌మేట్స్, స్నేహితులు పాల్గొని నూతన వైస్ చైర్మన్‌నుఅభినందించారుఫ్రెండ్షిప్ డే సందర్భంగా జరిగిన ఈ ఆత్మీయ కలయిక స్నేహితుల మధ్యఉన్నఅనుబంధానికి నిదర్శనంగా నిలిచింది.

ఆకుల రాజు తండ్రి మృతిపై అయ్యప్ప ఫౌండేషన్ సభ్యుల ప్రగాఢ సానుభూతి…. కుటుంబ సభ్యులను పరామర్శించిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *