బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

డాక్టర్ అవతారమెత్తిన మెడికల్ షాప్ ఓనర్

కళ్ళు కనిపించకపోయినా ఇంజక్షన్ చేస్తాడు

పిస్క్రిప్షన్ లేకుండానే విచ్చలవిడిగా మందుల అమ్మకాలు

పేద మధ్యతరగతి ప్రజల ప్రాణాలతో చెలగాటం

పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ

నామమాత్రంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు

కమిషన్ ఏజెంట్లుగా మారిన కొందరు ఆర్.ఎం.పి, పి.ఎం.పి వైద్యులు

మియపూర్ విజయ భారతి న్యూస్ ; మదినాగుడా డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ అండ్ జనరల్ స్టోర్ బాలాజీ క్లినిక్ మెడికల్ షాపు ఓనర్లే డాక్టర్ గా చలామణి అవుతున్నారు. వర్షాకాలంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలకు వాంతులు, విరోచనాలు, జ్వరాలు రావడంతో పేద, మధ్యతరగతి ప్రజలు చిన్న చిన్న క్లినిక్ లకు వెళ్లి వారి సమస్యను పరిష్కరించుకుంటారు. కురుస్తున్న వర్షాలకు చిత్ర విచిత్రమైన రోగాలు రావడంతో కొంతమంది మెడికల్ షాపు ఓనర్లే డాక్టర్లుగా పేషెంట్లను చూస్తూ, ఇంజక్షన్లు ఇస్తూ, డాక్టర్లుగా చెలామని అవుతున్నారు.

పిస్క్రిప్షన్ లేకుండానే విచ్చలవిడిగా మందుల అమ్మకాలు.. అనారోగ్య సమస్యలపై డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదు. సమస్య చెవితే చాలు మెడికల్ షాపుల్లో అన్ని రకాల మందులు, ఇంజక్షన్లు ఇస్తారు. ఎంత మొత్తంలో కావాలన్నా ఇస్తారు దానికి ఎలాంటి డాక్టర్ రిసెప్షన్ కూడా అవసరమే లేదు ఏ మందులు వేసుకోవాలి, ఎన్ని పూటలు వేసుకోవాలి, ఎన్ని రోజులు వేసుకోవాలో కూడా మెడికల్ షాప్ నిర్వాహకులే చెప్పేస్తారు. ఇలా ఎన్నో మెడికల్ షాపులలో పోనట్లే అడ్డగోలుగా మందులు విక్రయిస్తున్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

పేద మధ్యతరగతి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మెడికల్ షాపు ఓనర్లు ఈ విచ్చలవిడి విక్రయాలపై డ్రగ్ ఇన్స్పెక్టర్ ల చేయలేమి లేకపోవడంతో మెడికల్ షాపు ఓనర్లకు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా రెచ్చిపోతున్నారు. మెడికల్ మాఫియా రోజురోజుకు హద్దులు దాటి డాక్టర్ పిక్సెప్షన్ లేకుండానే మెడికల్ షాప్ ఓనర్స్ వైద్యం చేస్తున్నారు. విచ్చలవిడిగా యాంటీబయోటిక్, అలాగే శాంపుల్స్ తో భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ…

ఫార్మసీ చట్టం ప్రకారం 1948 సెక్షన్ 42 ప్రకారం రిజిస్టర్ ఫార్మసిస్ట్ తప్ప మరో వ్యక్తి మందులు అమ్మకూడదు, పంపిణీ చేయకూడదు, ఎలాంటి అర్హత లేకుండా మెడికల్ షాప్ తీసిన వైద్యం చేసిన ఆరు నెలల జైలు శిక్ష

నెయ్యి రూపాయల జరిమానా లేదా రెండు విధిస్తారు. ఈ విషయం తెలిసిన కూడా 50% శాతం మెడికల్ షాపుల్లో అర్హత కలిగిన ఫార్మసిస్ట్ లేకుండానే మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మెడికల్ షాప్ ఒకరిది సర్టిఫికెట్లు మరొకరివి పేట్టి చలామని చేస్తున్నారు.

ఈ మెడికల్ షాపులలో అర్హతలేని వ్యక్తులు పనిచేయటం వలన ఇష్టం వచ్చిన మందులను ఇచ్చి అధిక లాభాలను తీసుకుంటున్నారు. మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా మందుల షాపుల యజమానులు వ్యాపారం కొనసాగిస్తున్నారు.

నామమాత్రంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు… పిస్క్రిప్షన్ లేకుండా విచ్చలవిడిగా మాత్రలు అమ్ముతున్న వారిపై డ్రగ్ ఇన్స్పైక్టర్ లు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మెడికల్ షాపులలో తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మందుల దుకాణాలలో డాక్టర్లు ఇచ్చే నమూనా జనరిక్ మందులను కూడా ఎక్కువ ధరలకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. నకిలీ డాక్టర్లు క్లినిక్ లు వైద్యశాలలు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

కమిషన్ ఏజెంట్లుగా మారిన కొందరు ఆర్.ఎం.పి. పి.ఎం.పి వైద్యులు… నగర శివారు ప్రాంతాల్లో ఆర్.ఎం.పి. పి. ఎం.పి వైద్యులు పరిమితికి మించి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలు బలి గొంటున్నారు. నగరంలోని ప్రవేట్ దావఖానాలకు రోగులను రిఫర్ చేస్తే కమీషన్ వస్తుందని ఏజెంట్లుగా మారిన శివారు ప్రాంత వైద్యులు కుబేరులవుతున్నారు. వైద్య రంగంలో ఎలాంటి అర్హతలు లేకున్నా విచ్చలవిడిగా దవాఖానాల బోర్డులు పెట్టి, స్థాయికి మించి వైద్యం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అవన్నీటికి చరమగీతం పాడాలంటే వైద్య ఆరోగ్యశాఖ ఉన్న తాధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి సకిలీ మందుల షాపులను ప్రవేట్ ఆసుపత్రులలో సకిలి వైద్యులను గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టి దాడులను కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.