బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ

ఆర్మూర్‌లో మున్సిపల్ పాలన ఎక్కడ…?

ఆర్మూర్‌లో మున్సిపల్ పాలన ఎక్కడ…?

డ్రైనేజీలు లేక బురదమయమైన రోడ్లు…..

వర్షాకాల వ్యాధులపై అవగాహన ఏదీ….?

అధికారుల నిర్లక్ష్యంపై కాలనీవాసుల ఆవేదన….

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…

(విజయభారతి) ఆర్మూర్ న్యూస్: ఆగస్టు 12

ఆర్మూర్: వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీల శుభ్రత, నిల్వ నీటి తొలగింపు వంటి చర్యలు ముమ్మరం చేయాల్సిన సమయంలో ఆర్మూర్ పట్టణంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగాకనిపిస్తున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి చేరి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.
ముఖ్యంగా ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్ ప్రాంతాల్లోని పలు కాలనీల్లో ఇప్పటికీ సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షం పడిన ప్రతిసారీ రోడ్లు బురదమయంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సీసీ రోడ్లు లేకపోవడంతో నడిచేందుకు, వాహనాలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో హామీలు.. ఆ తర్వాత పట్టించుకునేవారే లేరు?
ఇటీవల ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని నమ్మి వారిని గెలిపించామని, కానీ తమ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని కొందరు కాలనీవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సంవత్సరాలు గడుస్తున్నా కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు అందుబాటులోకి రాకపోవడం పట్ల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం స్పందించి నిధులు విడుదల చేసి పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వర్షాకాలంలో తనిఖీలు ఎక్కడ?వర్షాకాలంలో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించేందుకు మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలునిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, నిల్వ నీటిని తొలగించడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం, ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు మరింత వేగవంతం చేయాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఆర్మూర్ పట్టణంలోని సమస్యాత్మక కాలనీలను గుర్తించి సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.