పెద్దమందడి : పెద్దమందడి మండలంలోని మోజర్ల ఉద్యాన కళాశాల ప్రాంగణంలోని ఉద్యాన డిప్లమా కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అభిలాష్ మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలో జరిగిన టార్గెట్ బాల్ పోటీలలో పాల్గొని మహబూబ్నగర్ జిల్లా జట్టుకు ఎంపిక కావడం జరిగింది.
ఈ జట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి టార్గెట్ బాల్ 6th జూనియర్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్ లో పాల్గొని ద్వితీయ బహుమతి సాధించడం జరిగింది. మహబూబ్నగర్ జట్టులో ప్రతిభ కనబరిచిన అభిలాష్ ని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పిడిగం సైదయ్య అభినందించారు. పాలిటెక్నిక్ విద్యార్థులు చదువుతూ పాటు సమానంగా క్రీడలకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో ఓఎస్ఏ డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ షహనాజ్, డాక్టర్ విద్య, డాక్టర్ గౌతమి, టీచింగ్ స్టాఫ్ ప్రొఫెసర్స్, ఫిజికల్ డైరెక్టర్ మహేష్, తోటి విద్యార్థులు అభిలాష్ ని అభినందించారు.