శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; జిహెచ్ఎంసి పారిశుద్ధ్య విభాగంలో పనిచేసి పదవి విరమణ పొందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఎం నాయకుడు కొంగరి కృష్ణ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. అనారోగ్యం తదితర కారణాలతో విధులకు దూరంగా ఉన్న పారిశుద్ధ కార్మికుల కుటుంబ సభ్యులకు అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దారిద్ర రేఖకు దిగిన ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులే ఎక్కువగా పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమై ఉన్నారని గుర్తు చేశారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పరిసరాలను పరిశుభ్రం చేసే కార్మికులకు తగిన గుర్తింపు ఇవ్వాలని కొంగరి కృష్ణ కోరారు. ఈ మేరకు చందానగర్ డిప్యూటీ కమిషనర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిల్లో 25,613 మంది పైబడి కార్మికులు పనిచేస్తుండగా అందులో వివిధ కారణాలతో ఒకోక్క సర్కిల్లో 35 నుండి 125 మంది వరకు సుమారుగా 2500 మంది నిధులకు దూరంగా ఉన్నారని అన్నారు. నగరవ్యాప్తంగా కాలనీలలో విస్తరించి జనాభా పెరిగిందని అన్నారు. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించే సిబ్బందిని అదనంగా నియమించాల్సిన అవసరం ఉందని అన్నారు. రెండు వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఆయా స్థానాలలో కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా గతంలో జిహెచ్ఎంసి అధికారులు ప్రత్యేక జీవో విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ జీవో ఆధారంగా విధులకు దూరంగా ఉన్న పారిశుద్ధ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కరోనా సమయంలో పారిశుద్ధ కార్మికులు చేసిన త్యాగం వారి కృషిని పొగిడిన ప్రభుత్వాలే వారిని పట్టించుకోకపోవడం
విచారకరమన్నారు. తగినంత పారిశుద్ధ సిబ్బంది లేక నగరంలో అనేక కాలనీలో చెత్తాచెదారంతో నిండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. డెంగ్యూ ,మలేరియా తదితర వ్యాధుల విజృంభించి అనారోగ్యంతో ప్రజలు ఆసుపత్రిపాలవుతున్నారని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మక విధులు నిర్వహించే పారిశుద్ధి సిబ్బందికి తగన ప్రాధాన్యం కల్పించాలని అన్ని సర్కిల్లో ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని కోరారు. సిబ్బంది కొరతతో అదనపు భారం పడుతుందని అన్నారు. జిహెచ్ఎంసి కమిషనర్, మేయర్ వెంటనే స్పందించి ఖాళీలు భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.శేరిలింగంపల్లి విజయభారతి న్యూస్ ; జిహెచ్ఎంసి పారిశుద్ధ్య విభాగంలో పనిచేసి పదవి విరమణ పొందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఎం నాయకుడు కొంగరి కృష్ణ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. అనారోగ్యం తదితర కారణాలతో విధులకు దూరంగా ఉన్న పారిశుద్ధ కార్మికుల కుటుంబ సభ్యులకు అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దారిద్ర రేఖకు దిగిన ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులే ఎక్కువగా పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమై ఉన్నారని గుర్తు చేశారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పరిసరాలను పరిశుభ్రం చేసే కార్మికులకు తగిన గుర్తింపు ఇవ్వాలని కొంగరి కృష్ణ కోరారు. ఈ మేరకు చందానగర్ డిప్యూటీ కమిషనర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిల్లో 25,613 మంది పైబడి కార్మికులు పనిచేస్తుండగా అందులో వివిధ కారణాలతో ఒకోక్క సర్కిల్లో 35 నుండి 125 మంది వరకు సుమారుగా 2500 మంది నిధులకు దూరంగా ఉన్నారని అన్నారు. నగరవ్యాప్తంగా కాలనీలలో విస్తరించి జనాభా పెరిగిందని అన్నారు. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించే సిబ్బందిని అదనంగా నియమించాల్సిన అవసరం ఉందని అన్నారు. రెండు వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఆయా స్థానాలలో కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా గతంలో జిహెచ్ఎంసి అధికారులు ప్రత్యేక జీవో విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ జీవో ఆధారంగా విధులకు దూరంగా ఉన్న పారిశుద్ధ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కరోనా సమయంలో పారిశుద్ధ కార్మికులు చేసిన త్యాగం వారి కృషిని పొగిడిన ప్రభుత్వాలే వారిని పట్టించుకోకపోవడం
విచారకరమన్నారు. తగినంత పారిశుద్ధ సిబ్బంది లేక నగరంలో అనేక కాలనీలో చెత్తాచెదారంతో నిండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. డెంగ్యూ ,మలేరియా తదితర వ్యాధుల విజృంభించి అనారోగ్యంతో ప్రజలు ఆసుపత్రిపాలవుతున్నారని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మక విధులు నిర్వహించే పారిశుద్ధి సిబ్బందికి తగన ప్రాధాన్యం కల్పించాలని అన్ని సర్కిల్లో ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని కోరారు. సిబ్బంది కొరతతో అదనపు భారం పడుతుందని అన్నారు. జిహెచ్ఎంసి కమిషనర్, మేయర్ వెంటనే స్పందించి ఖాళీలు భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
