విజయభారతి న్యూస్ ;
ఇకపై అన్యమతస్థులకు దేవాలయ ప్రవేశం లేదని తమిళనాడు హైకోర్ట్ సంచలన తీర్పును ఇచ్చింది. ఈ సంధర్బంగా హైకోర్ట్ తీర్పునిస్తూ “హిందూ ఆలయాలు పిక్నిక్ స్థలాలు కాదు, హిందూ దేవాలయాలు పవిత్రతకు నిలయాలు. హిందూ ధర్మంపై నమ్మకం లేనివారికి ఆలయంలోకి ప్రవేశం ఎందుకు?? ఇకపై ఇతర మతస్థులకు ఆలయాలలో ప్రవేశం లేదు. ఒక వేళ అన్యమస్థులెవరైనా దేవాలయాలలోకి రావాలని కోరుకుంటే వారు తప్పనిసరిగా “నేను హిందూ దేవీ దేవతలను నమ్ముతున్నాను” అని ఆలయ సిబ్బంది వద్ద సంతకం పెట్టి దేవాలయంలోకి వెళ్ళాలి” అని మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పును ఇచ్చింది. కాగ మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన ఈ తీర్పుతో DMK ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది..