విజయభారతి న్యూస్ ;
దుండిగల్ సరస్వతి విద్యా మందిర్ అభివృద్ధికి సాహితీ కలివేముల చిరు కానుక
బీజేపీ మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మియాపూర్ నివాసితులు శ్రీ కలివేముల మనోహర్ గారి కుమార్తె సాహితీ తన జన్మదిన సందర్భంగా వరుసగా 9వ సంవత్సరం దుండిగల్ శిశు మందిర పాఠశాలకు అభివృద్ధికి తన యొక్క ఒక నెల వేతనంను రూ.50000.00 ( ఏబది వేల రూ.) శ్రీ సరస్వతీ విద్యాపీఠం దుందిగల్ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ శ్రీమన్నారాయణ కి సాహితీ కలివేముల అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ ప్రధాన కార్యదర్శి మహేష్ ,యాదగిరి కలివేముల, మహాలక్ష్మీ ,,మంజుల,మనోహర్ కలివేముల పాల్గొన్నారు.