Breaking News

విద్యార్థి ఉద్యమ నేత నేటి కలం యోధుల నేతగా

టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎండి సలీమ్ పాషా

ప్రగతి రిసార్ట్స్ లో జరిగిన జిల్లా మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నిక

హాజరైన మాజీ జాతీయ అధ్యక్షులు దేవులపల్లి అమర్,జాతీయ కార్యదర్శి నరేందర్ రెడ్డి,రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు విరహత్ అలీ,రామ్ నారాయణ,శ్రీకాంత్ రెడ్డి

శేరిలింగంపల్లి విజయ భారతి న్యూస్ ;
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ ఎండి సలీమ్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శంకర్ పల్లి మండలం పొద్ద టూర్ గ్రామ పరిధిలో గల ప్రగతి రిసార్ట్స్ లో టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా మహాసభలు అట్టహాసంగా జరిగాయి.ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా శేరిలింగంపల్లి నియోజకవర్గ మన తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ ఎండి సలీమ్ పాషా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం నుండి వార్త, నమస్తే తెలంగాణ, సూర్యపత్రికలలో రిపోర్టర్ గా పనిచేసి ప్రస్తుతం మన తెలంగాణ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. యూనియన్ లో రాష్ట్ర,జాతీయ కౌన్సిల్ సభ్యునిగా, సోషల్ మీడియా ప్రచార కమిటీ సభ్యునిగా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీకాం, బీసీజే, ఎల్ ఎల్ బి, ఎల్ఎల్ఎం, కాకతీయ యూనివర్సిటీ నుండి ఎంసిజే పూర్తి చేసిన సలీమ్ పాషా విద్యార్థి ఉద్యమ నేతగా, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. వైజ్ మెన్ లాంటి స్వచ్ఛంద సంస్థలలో సైతం సెంట్రల్ ఇండియా రీజన్ లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులతో సత్సంబంధాలు ఉండటంతో సలీమ్ ను జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అమరవీరుల త్యాగాలకు అవమానం…

జర్నలిస్టుల గొంతుకగా పనిచేస్తాసలీమ్ పాషా

తనను రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్, ఐజేయూ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, జాతీయ కార్యదర్శి నరేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాం నారాయణ, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికవ్వటానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. జర్నలిస్టుల గొంతుకగా పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

అభినందనల వెల్లువ
జిల్లా యూనియన్ నూతన అధ్యక్షుడిగా సలీమ్ పాషా ఎన్నిక పట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల ప్రెస్ క్లబ్ ల తరుపున శుభాకాంక్షలు తెలిపారు. ఎల్ బి నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, షాద్ నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండ విజయ్ కుమార్, చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షులు యాదయ్య, శంకర్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి మల్లికార్జున్, జిలానీలు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *