బ్రేకింగ్ న్యూస్
దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్తున్నారా ?…కోమటిపల్లిలో భూముల రీ సర్వే…ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…జిల్లాలో రెచ్చిపోతున్న ప్రైవేట్ బ్యాంక్ యజమానులు ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్లు యువకుడి బలవన్మరణం!ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల గోస.. పట్టించుకునే నాథుడేరీ…?అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో వివక్ష ? నిబంధనలు కొందరికేనా?మియాపూర్ డీఏవీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలుటిఆర్ఎస్ మదీనాగూడ డివిజన్ అధ్యక్షుడిగా కొల్లూరు కుమార్ కురుమమధినాగుడాగ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ సంబరాలుగోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….భూభారతి పెండింగ్ ఫైళ్లను పరిశీలించిన సబ్ కలెక్టర్…
తెలంగాణ వార్తలు

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు: మున్సిపల్ ఛైర్పర్సన్….

విజయభారతి : ఆర్మూర్ న్యూస్

ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం, మానవత్వాన్ని పెంపొందిస్తాయని ఆర్మూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ గోనె లహరి రఘు అన్నారు. బుధవారం ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జంబిహాన్ ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని మున్సిపల్ ఛైర్పర్సన్ తెలిపారు. భారతీయ సంస్కృతిలో అన్నదానాన్ని మహాదానంగా భావిస్తారని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో, సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతి భక్తుడు అయ్యప్ప స్వామి బోధించిన క్రమశిక్షణ, సేవా తత్వం, సమానత్వ భావనను జీవితంలో ఆచరించాలని కోరారు. అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు, దాతలకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అయ్యప్ప స్వామి వారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నగేష్ శర్మ గురుస్వామి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి, కార్యదర్శులు మీసాల రవి, ముఖ్య సలహాదారులు జనార్దన్ గౌడ్, దత్తు, పోల సుధాకర్, సిఎట్ అశోక్, స్వామి, శ్రీహరి, కౌటిక విజయ్, మీసాల రాజేశ్వర్, వంట నరేష్, మున్సిపల్ కౌన్సిలర్లు బొగడ మీది సుమన్, బొప్పెన ప్రసాద్, బిజెపి నాయకులు నూతుల శ్రీనివాస్, కంచెట్టి గంగాధర్, ద్యాగ ఉదయ్, బాల్కొండ రాజు, పూల ప్రసాద్, నందు, గంగాధర్ గౌడ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

కోమటిపల్లిలో భూముల రీ సర్వే…