(విజయభారతి నిజామాబాద్ న్యూస్ ) Jul 23, 2026,
ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా మేఘావృత వాతావరణం నెలకొని, చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
